జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కృష్ణా జిల్లా వత్సవాయి మండలం లింగాలలో తన అభిమాని ఇంటికి వెళ్లారు. కేన్సర్‌తో బాధపడుతున్న భార్గవ్‌ను పరామర్శించారు. వైద్య సాయం కోసం రూ. 5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. భార్గవ్‌కు ధైర్యం చెప్పి.. వెండి గణపతి విగ్రహాన్ని అందించారు. అతని తల్లిదండ్రులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యం అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడారు. ఎన్ఆర్ఐ దాతల నుంచి సహాయం అందేలా ఏర్పాట్లు చేస్తామని పవన్ హామీ ఇచ్చారు.
మరోవైపు పవన్ రాక సమాచారం అందుకున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు.