గ్రామ, వార్డు సచివాలయ ప్రశ్నపత్రాల లీకేజీపై పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పారదర్శకత మాటల్లో కాదు.. చేతల్లో చూపించాలన్నారు.
పేపర్ లీకేజీ ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని అన్నారు. పేపర్ లీకేజీ ఆరోపణలపై సత్వర విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరారు. వ్యవస్థ వల్ల యువత ఇబ్బందిపడే పరిస్థితి రాకూడదని అభిప్రాయపడ్డారు. జీవితాలు మారుతాయన్న కొండంత ఆశతో అభ్యర్థులు పరీక్ష రాశారని...అధికార పార్టీకి కొమ్ముకాసే వారికే ఉద్యోగాలు ఇస్తున్నట్లు అనిపిస్తోందని పేర్కొన్నారు.
'పారదర్శకత మాటల్లో కాదు... చేతల్లో చూపించాలి' - పారదర్శకత
గ్రామ, వార్డు సచివాలయ ప్రశ్నపత్రాల లీకేజీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
!['పారదర్శకత మాటల్లో కాదు... చేతల్లో చూపించాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4511937-72-4511937-1569077962396.jpg)
PAWAN_KALYAN_ABOUT_PANCHAYATHI_SECRETARY_PAPER_LEAK