ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చరిత్రాత్మక సభకు అనారోగ్యం వల్ల వెళ్లలేకపోతున్నా: పవన్‌

రామ్​నాథ్ కొవింద్ తన అయిదేళ్ల పదవీకాలంలో ఎటువంటి పొరపొచ్చాలకు తావు లేకుండా రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించటం ఆయనలోని రాజనీతిజ్ఞతకు నిదర్శనమని జనసేన అధినేత పవన్ కొనియాడారు. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేయనున్నకొవింద్ వీడ్కోలు సభ రేపు దిల్లీలో జరగనుండగా..తనకు ఆహ్వానం అందిందని తెలిపారు.

pawan-has-been-invited-to-the-president-farewell-party
pawan-has-been-invited-to-the-president-farewell-party

By

Published : Jul 21, 2022, 9:54 PM IST

Updated : Jul 21, 2022, 11:25 PM IST

పవన్ ప్రకటన

రాష్ట్రపతిగా పదవీ విరమణ చేయనున్న రామ్​నాథ్ కొవింద్ వీడ్కోలు సభ రేపు దిల్లీలో జరగనుంది. ఈ సభకు జనసేన అధినేత పవన్ కల్యాణ్​కు ఆహ్వానం అందింది. కాగా.. తప్పనిసరిగా హాజరుకావాల్సిన ఈ చరిత్రాత్మక సభకు ఆరోగ్య కారణాల దృష్ట్యా వెళ్లలేకపోతున్నానని పవన్ ప్రకటన విడుదల చేశారు. అందుకు చింతిస్తున్నాని వెల్లడించారు.

రామ్​నాథ్ కొవింద్ తన అయిదేళ్ల పదవీకాలంలో ఎటువంటి పొరపొచ్చాలకు తావు లేకుండా రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించటం ఆయనలోని రాజనీతిజ్ఞతకు నిదర్శనమని పవన్ కొనియాడారు. ఆయన తన సేవలను నిర్విరామంగా నిర్వర్తించాలని,ఆ భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆరోగ్య ఆనందాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. తనను సభకు ఆహ్వానించిన ప్రధాని మోదీ, అమిత్ షాకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చూడండి

Last Updated : Jul 21, 2022, 11:25 PM IST

ABOUT THE AUTHOR

...view details