రాష్ట్రంలో ఇసుక కొరత, కార్మికుల ఆత్మహత్మలపై పోరాటం చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమస్యను కేంద్రం పెద్దల దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇసుక కొరతపై ఇప్పటికే విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించిన జనసేనాని.... ఆ తర్వాత గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.
దిల్లీలో జనసేనాని పర్యటన.. నేడు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ - పవన్‌కల్యాణ్ దిల్లీ పర్యటన తాజా
నేడు దిల్లీలో పలువురు కేంద్ర ప్రభుత్వ ప్రముఖులతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ భేటీకానున్నారు. ఇసుక కొరత, ఇతర సమస్యలపై చర్చించనున్నారు. నిన్న గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆహార శిబిరాల ప్రారంభం అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిల్లీ బయల్దేరివెళ్లారు. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక సమస్యపై కేంద్రమంత్రులు సహా ఇతర ప్రముఖులతో మాట్లాడనున్నారు. భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలతో పాటు అనేక అంశాలపై చర్చించనున్నారు.
pawan
ఇవాళ దిల్లీలో పలువురు కేంద్ర ప్రభుత్వ ప్రముఖులతో భేటీకానున్న పవన్‌కల్యాణ్... ఇసుక కొరత, ఇతర సమస్యలపై చర్చించనున్నారు. కాళ్లకు ఇసుక బస్తాలు కట్టుకుని సీఎం జగన్ నడుస్తున్నట్లుగా ఉన్న వ్యంగ్య చిత్రాన్ని పవన్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. జగన్ గురించి దిల్లీలో ఇలాంటి అభిప్రాయమే ఉందంటూ వ్యాఖ్యానించారు. 5 నెలల్లోనే 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధి దెబ్బతిందన్న పవన్... 50 మంది కార్మికుల ప్రాణాలు కోల్పోయేలా చేసిన ఘనత వైకాపాకే దక్కిందని ట్వీట్ చేశారు.
Last Updated : Nov 16, 2019, 9:30 AM IST