ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రిషీకపూర్ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు' - రిషీ కపూర్ మృతికి పవన్ సంతాపం

బాలీవుడ్​ ప్రముఖ నటుడు రిషీకపూర్(67).. క్యాన్సర్​తో పోరాడుతూ ఇవాళ ముంబయిలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. రిషీకపూర్‌ మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటని టాలీవుడ్ కథానాయకులు బాలకృష్ణ, పవన్ కల్యాణ్ అన్నారు.

rishi kapoor
rishi kapoor

By

Published : Apr 30, 2020, 1:32 PM IST

బాలీవుడు నటుడు రిషీకపూర్‌ మృతిపట్ల నందమూరి బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు.

ఇర్ఫాన్ ఖాన్, రిషీకపూర్ లాంటి నట దిగ్గజాలు హఠాత్తుగా మనకు దూరమవడం చాలా బాధాకరం. భారతీయ సినిమాకు ఇది తీరని లోటు. వారి విశేష ప్రతిభ, చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుంటారు. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను- బాలకృష్ణ

రిషీకపూర్‌ ఇక లేరని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన మృతి భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు. రిషీకపూర్‌ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి -పవన్‌కల్యాణ్‌

ఇదీ చదవండి..

బాలీవుడ్ ప్రముఖ నటుడు రిషీ కపూర్​ అస్తమయం

ABOUT THE AUTHOR

...view details