ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

త్వరలో 'మన నుడి- మన నది' కార్యక్రమం: పవన్ - జనసేన కార్యక్రమం

మన భవితకు ప్రాణాధారమైన మాతృభాషను కాపాడుకోకపోతే... సంస్కృతికి దూరమవుతామని జనసేన అధ్యక్షుడు పవన్​కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. నాగరికతకు పుట్టినిల్లయిన నదులను... విషమయం చేసుకోవడం బాధాకరమన్నారు.

పవన్

By

Published : Nov 20, 2019, 10:25 PM IST

జనసేన పార్టీ విడుదల చేసిన వీడియో

మాతృభాష పరిరక్షణ, నదుల సంరక్షణ కోసం తమ పార్టీ తరపున 'మన నుడి- మన నది' పేరిట కార్యక్రమం చేపట్టబోతున్నట్లు... జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. హైదరాబాద్​లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ విషయంపై మేధావులు, నిపుణులతో చర్చించామన్నారు. నదిలేనిదే నాగరికత లేదని... భాష లేనిదే సంస్కృతి లేదని పవన్ అభిప్రాయపడ్డారు.

మన భాషా మూలాల్ని మనమే నరుక్కుంటున్నామని... మాతృభాషను కాపాడుకోకపోతే సంస్కృతికి దూరమవుతామని పేర్కొన్నారు. నాగరికతకు నది పుట్టినిల్లని... మనిషి మనుగడకూ నదులు కీలకమని అన్నారు. జీవనాధారమైన నదుల్ని చేతులారా విషమయం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మాతృభాషను, నదులను కాపాడుకునేందుకు రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేసేలా 'మన నుడి- మన నది' కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details