ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

pavan wishes: తెలుగు ప్రజలకు పవన్ సంక్రాంతి శుభాకాంక్షలు - పవన్ కల్యాణ్ వార్తలు

జనసేనాని పవన్ కల్యాణ్ తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ పండుగలన్నీ పర్యావరణ ప్రకృతి ఆధారిత సంబరాలేనని అన్నారు.

pavan kalyan sankranti wishes
pavan kalyan sankranti wishes

By

Published : Jan 14, 2022, 8:21 PM IST

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ పండుగలన్నీ ప్రకృతి-పర్యావరణం ఆధారిత సంబరాలేనని అన్నారు. ఆరుగాలం శ్రమించి చేతికొచ్చిన పంటను చూసుకుని రైతు మురిసిపోయే వేడుకే మన సంక్రాంతి పండుగగా పేర్కొన్నారు. ప్రకృతి పరంగా చూస్తే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే తరుణంలో వచ్చే ఈ పండుగను మకర సంక్రాంతిగా జరుపుకోవడం అందరికీ తెలిసిన విషయమేనని.. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతు సౌభాగ్యవంతంగా విలసిల్లాలని ఆకాంక్షించారు. ఈ సంక్రాంతి తెలుగువారందరికీ మంచి ఆరోగ్యాన్ని, భోగభాగ్యాలను అందించాలని కోరుకుంటున్నానని పవన్‌ అన్నారు. దేశ ప్రజలందరికీ తన తరఫున, జనసేన శ్రేణుల పక్షాన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details