ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PAWAN KALYAN: నేను పగటి కలలు కనట్లేదు: షర్మిల పార్టీపై పవన్​ - pavan kalyan latest news

జనసేన అధినేత పవన్​కల్యాణ్​ షర్మిల పార్టీ ప్రకటనపై స్పందించారు. ఆమెకు స్వాగతం చెబుతున్నానన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నో పార్టీలు రావాలన్న పవన్​.. ఉద్యమ, చైతన్య స్ఫూర్తి కలిగిన యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.

పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్

By

Published : Jul 8, 2021, 1:55 PM IST

Updated : Jul 8, 2021, 3:52 PM IST

నేను పగటి కలలు కనట్లేదు

తెలంగాణలో వైఎస్​ షర్మిల పార్టీ ప్రకటనపై జనసేన అధినేత స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నో పార్టీలు రావాలని పేర్కొన్నారు. తెలంగాణలో షర్మిల పార్టీకీ స్వాగతం చెబుతున్నానంటూ వ్యాఖ్యానించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్​లోని మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న పవన్​.. తిరుగు ప్రయాణంలో బేగంపేట ఎయిర్​పోర్టులో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఉద్యమ, చైతన్య స్ఫూర్తి కలిగిన యువత రాజకీయాల్లోకి రావాలని పవన్​ కల్యాణ్​ (pawan kalyan)పేర్కొన్నారు. తనకు రాజకీయ వారసత్వం చేతకాదన్న జనసేన అధినేత.. తెలంగాణలో పార్టీ బలోపేతం చేయాలని అనుకున్నా.. తనకు డబ్బు బలం లేదన్నారు. తాను పగటి కలలు కనే వ్యక్తిని కాదని వ్యాఖ్యానించారు.

కొత్త పార్టీలు రావాలి. ఎక్కువ మంది రావాలి. ప్రజలకు మంచి చేస్తే ఏదైనా మంచిదే. ఏ పార్టీ ఎవరు పెట్టినా స్వాగతిస్తాం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉన్న నేల. ఇలాంటి నేలలో కొత్త రక్తం, చైతన్యంతో కూడిన యువత రాజకీయంలోకి రావాలి. మా పార్టీపరంగా అలాంటి వారిని గుర్తించి.. తెలంగాణకు మేలు జరిగేలా చూస్తాం. తెలంగాణలో జనసేన పార్టీ నిర్మాణం నాకు కష్టసాధ్యమైంది. -పవన్​కల్యాణ్​, జనసేన అధినేత

ఇదీ చూడండి:

CM JAGAN: 'చిరునవ్వు ఆయన పంచిన ఆయుధం... పోరాడే గుణం ఆయన ఇచ్చిన బలం'

Last Updated : Jul 8, 2021, 3:52 PM IST

ABOUT THE AUTHOR

...view details