ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోండి' - ఏపీలో కరోనా వార్తలు

అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని జనసేనాని పవన్ కల్యాణ్ కోరారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెట్టుబడి రాయితీ, ఉపశమన పథకాలు అమలు చేయాలన్నారు.

pavan kalyan
pavan kalyan

By

Published : Apr 26, 2020, 1:51 PM IST

రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన పవన్ కల్యాణ్

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ప్రభుత్వాన్ని కోరారు. అకాల వర్షాలు.. వరి, మొక్కజొన్న, ఉద్యాన పంటల రైతులకు కన్నీరు మిగిల్చాయన్నారు. ప్రభుత్వం సత్వరం స్పందించి రైతులకు పెట్టుబడి రాయితీ అందించాలని విజ్ఞప్తి చేశారు. దెబ్బతిన్న వరి రైతులకు ఉపశమన పథకాలు అమలుచేయాలని కోరారు.

రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. మామిడి రైతుల ఆశలను కరోనా, అకాల వర్షాలు బాగా దెబ్బతీశాయని ఆవేదన చెందారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి నిధులు కేటాయించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ సమయంలో నీటి తీరువా రెట్టింపు చేయాలనే ప్రతిపాదన సరికాదని జనసేనాని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details