ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంటి పన్ను పెంపును నిరసిస్తూ.. 28, 29న పట్టణ పౌర సమాఖ్య ఆందోళన - రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఇంటి పన్ను జీవోలపై నిరసవకు పట్టణ సమాఖ్య పిలుపు

రాష్ట్ర​ ప్రభుత్వం కేంద్ర ప్రతిపాదనల మేరకు తెచ్చిన కొత్త ఇంటి పన్ను విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేయాలంటూ ప్రజలకు.. పట్టణ పౌర సమాఖ్య పిలుపునిచ్చింది. ప్రజలపై భారం మోపేవిగా ఉన్న చట్ట సవరణ జీవోలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఈ నెల 28, 29న ఆందోళన చేయనున్నట్టు ప్రకటించింది.

call for protest against new house taxes
కొత్త ఇంటి పన్ను జీవోలపై పట్టణ పౌర సమాఖ్య పోరు

By

Published : Dec 26, 2020, 7:12 PM IST

ఇంటి పన్ను విధానం మార్పునకు నిరసనగా.. వార్డు సచివాలయాల్లో ఈ నెల 28, 29న ఆందోళనలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య పిలుపునిస్తున్నట్టు ప్రకటించింది. స్థానిక పౌర సంఘాలు, కాలనీ అసోసియేషన్లు, అపార్ట్​మెంట్ అసోసియేషన్లు, వర్తక, వాణిజ్య సంఘాలు ఉమ్మడిగా ఐక్య కార్యాచరణ కమిటీలు పాల్గొంటాయని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఏక పక్షంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ చట్టాల్లో మార్పులు తెచ్చిందని ఆరోపించారు.

ఆస్తివిలువ ఆధారంగా ఇంటి పన్నులు విధించేందకు కొత్తగా సవరణలు చేశారన్నారు. చెత్తపన్ను విధించడానికి, మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థల నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తం వినియోగ చార్జీల పేరుతో పట్టణ ప్రజలపై భారం మోపేందుకు చట్ట సవరణలు చేస్తూ 196,197, 198 జీవోలు జారీ చేశారని ఆరోపించారు. ఈ ఉత్తర్వులు అమలైతే.. ప్రజలపై తీవ్రమైన భారం పడుతుందని.. ప్రభుత్వం మాత్రం 15 శాతానికి మించి ఇంటి పన్నులు పెరగవంటూ ప్రజలను మభ్య పెడుతోందని చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details