ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వారికి నోటీసులు ఇచ్చే దమ్ము.. ప్రభుత్వానికి ఉందా?: పట్టాభి - గంజాయి తాజా వార్తలు

గంజాయి సాగుపై అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి ఆనంద్ బాబు చెబితే నోటిలిస్తారా? అంటూ తెదేపా మండిపడింది. రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లపై దాడులు నిర్వహిస్తున్న ఇతర రాష్ట్రాల పోలీసులకు నోటీసులిచ్చే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అని పట్టాభి ప్రశ్నించారు.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/19-October-2021/13394595_pattabhi.JPG
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/19-October-2021/13394595_pattabhi.JPG

By

Published : Oct 19, 2021, 12:07 PM IST

రాష్ట్రంలో గంజాయి సాగుపై అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి ఆనంద్ బాబు.. చెబితే నోటీసులిస్తారా అంటూ.. తెలుగుదేశం మండిపడింది. రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లపై దాడులు నిర్వహిస్తున్న ఇతర రాష్ట్రాల పోలీసులకు నోటీసులు ఇచ్చే దమ్ము ప్రభుత్వానికి, పోలీసులకు ఉందా అని ఆపార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరాం ప్రశ్నించారు. ఆనంద్‌బాబు.. మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహిస్తే.. నర్సీపట్నం పోలీసులు రాత్రే గుంటూరు చేరుకుని నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డారు. వేరే ఏ ఇతర కేసుల్లోనైనా ఇంత మెరుపు వేగంతో పనిచేశారా? అని నిలదీశారు. తాడేపల్లి ప్యాలెస్ పాలేరు ఆడమన్నట్లుగా పోలీసులు ఆడతారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details