తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి(pattabhi)రామ్ పోలీసు కస్టడీ పిటిషన్‌ను విజయవాడ న్యాయస్థానం కొట్టేసింది. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇటీవల అరెస్టై బెయిల్‌పై విడుదలైన పట్టాభి(pattabhi)ని తమ కస్టడీకి ఇవ్వాలని గవర్నర్‌పేట పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పట్టాభి చేసిన వ్యాఖ్యల్లో కుట్ర కోణం దాగి ఉందని.. పూర్తి వివరాలు రాబట్టేందుకు కస్టడీలోకి ఇవ్వాలని కోరారు. పట్టాభి అరెస్టు ప్రక్రియ సరిగా లేదని.. ఈ విషయాన్ని ఉన్నత న్యాయస్థానం కూడా ప్రస్తావించిందని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం పోలీసుల పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
pattabhi: పట్టాభిని కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్ కొట్టివేత - పట్టాభిని కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్ కొట్టివేత
తెదేపా నేత పట్టాభి(pattabhi) పోలీసు కస్టడీ పిటిషన్‌ను విజయవాడ కోర్టు కొట్టివేసింది. పట్టాభిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
pattabhi police petition dismiss