తెలంగాణ రాష్ట్రంలో పాస్‌పోర్టుల జారీ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతోంది. కొవిడ్ ప్రభావంతో మార్చి చివరి వారంలో మూత పడిన పాస్‌పోర్టు సేవా కేంద్రాలు... మే 6 నుంచి దశల వారీగా పునఃప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో పాస్‌పోర్టు సేవలు అందించేందుకు పని చేస్తున్న 14 తపాలా కార్యాలయాలు ఇప్పటికీ తెరచుకోనేలేదు.
గతంలో రోజుకూ 700పాస్‌పోర్టులు జారీ
హైదరాబాద్‌లోని అమీర్‌పేట, టోలిచౌక్, బేగంపేటతోపాటు వరంగల్, నిజామాబాద్‌లోని అయిదు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు... రోజుకు దాదాపు రెండున్నర వేల పాస్‌పోర్టులు జారీ చేసేవి. వీటితో పాటు రాష్ట్రంలోని 14 తపాలా కార్యాలయాల నుంచి మరో 700 వరకు పాస్‌పోర్టులు జారీ అయ్యేవి. కాని కరోనా ప్రభావంతో సేవా కేంద్రాలు మూతపడడం వల్ల పాస్‌పోర్టుల జారీ ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయింది.