ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎద్దులను ఆపేదెవరు....పటాలను పట్టేదెవరు..! - సంక్రాంతి సంబరాల వార్తలు

కనుమ సందర్భంగా ఏటా నిర్వహించే పశువుల పండుగకు చిత్తూరు జిల్లా ఏ.రంగంపేట సిద్ధమైంది. పశువుల కొమ్ములకు కట్టిన పటాలను స్వాధీనం చేసుకునేందుకు..యువత ఉత్సుకతగా ఎదురుచూస్తున్నారు. పొరుగు రాష్ట్రాల ప్రజలూ పోటీలు తిలకించేందుకు తరలివస్తారు.

pashuvala-panduga-in-chittor-district
pashuvala-panduga-in-chittor-district

By

Published : Jan 16, 2020, 5:02 AM IST


వేగంగా దుసుకొచ్చే పశువులు..! వాటిని నియంత్రించేందుకు పోటీపడే యువత.... ఇదంతా చూస్తుంటే తమిళనాడు జల్లికట్టు గుర్తొస్తోంది కదా.! అచ్చం అలాంటి సంప్రదాయ పోటీలే చిత్తూరు జిల్లా ఏ.రంగంపేటలో నిర్వహిస్తారు. ఏటా కనుమ నాడు.... ఇక్కడ పశువుల పండుగ జరపడం ఆనవాయితీగా వస్తోంది.
అందంగా ముస్తాబు
ఉదయాన్నే పశువులను శుభ్రం చేసి అందంగా ముస్తాబు చేస్తారు. కొమ్ములకు....... అభిమాన కథానాయకులు, సినీ, రాజకీయ నాయకుల చిత్రాలపటాలు కడతారు. తర్వాత ఆ పశువులను.. గ్రామంలోని వీధుల్లో వదులుతారు. అప్పటికే గుమిగూడిన ప్రజల మధ్య నుంచి పశువులు వేగంగా దూసుకెళ్తుంటే వాటి కొమ్ములకు కట్టిన పటాలు స్వాధీనం చేసుకునేందుకు గ్రామస్థులు పోటీపడతారు. ఈ క్రమంలో... గాయాలనూ లెక్కచేయకుండా పశువులను లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తారు.

ఎద్దులను ఆపేదెవరు....పటాలను పట్టేదెవరూ..!
పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించాలనే..... ఏటా పశువుల పండుగ నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు చెప్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వచ్చేవారికి....అన్నపానీయాలూ గ్రామస్థులే అందిస్తారు. పశువులు, మనుషులకు గాయాలైతే వెంటనే చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా ప్రథమ చికిత్సాలయాలనూ ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details