ముఖ్యమంత్రి జగన్ అక్రమాలు, వైఎస్ హయాంలో అవినీతిని ప్రశ్నించిన కారణంగానే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేశారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. వైకాపా అరాచకం పరాకాష్టకు చేరిందని, రాష్ట్రంలో కక్ష రాజకీయాలు నడుస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రతి శుక్రవారం వాయిదాకి వెళ్లే జగన్... ఇపుడు తెదేపా నేతలను పంపుతున్నారని ఆక్షేపించారు.
రాష్ట్రంలో కక్ష రాజకీయాలు నడుస్తున్నాయి: దేవినేని
సీఎం జగన్, వైకాపా ప్రభుత్వంపై మాజీమంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిని ప్రశ్నించినందుకే తెదేపా నేత నరేంద్రను అరెస్టు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో కక్ష రాజకీయాలు నడుస్తున్నాయని... వైకాపా అరాచకాలు పరాకాష్టకు చేరాయని ధ్వజమెత్తారు. గొల్లపూడిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
దేవినేని ఉమ
ధూళిపాళ్ల నరేంద్ర 100 కోట్లు ఉన్న సంఘం డైరీ టర్నోవర్ 1100 కోట్లకు తీసుకువెళ్లారని దేవినేని వివరించారు. సహకార రంగంలో ఉన్న పాల సంస్థలను దెబ్బతీసేందుకు ఈ చర్యలని విమర్శించారు. హైకోర్టు పరిధిలో కేసులు ఉన్నా... పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారని, జగన్ ఏం చేసినా భయపడబోమని తేల్చిచెప్పారు. అమరావతి అసైన్డ్ భూముల కేసుల్లో అసలు విషయం బయట పెట్టాడని నరేంద్రపై కక్ష కట్టారని మాజీమంత్రి ఆక్షేపించారు.
ఇదీ చదవండీ... తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్