ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపా నేతల అక్రమ అరెస్ట్​లను ఖండించిన చంద్రబాబు - handrineva project news

హంద్రీనీవా పనులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ... తెదేపా తలపెట్టిన పాదయాత్రను అడ్డుకోవటంతో పాటు నాయకులను అరెస్టు చేయటాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. తక్షణమే అక్రమ కేసులు తొలగించాలని డిమాండ్ చేశారు.

party chief chandrababu condemns illegal arrests of TDP leaders
తెదేపా అధినేత చంద్రబాబు

By

Published : Oct 26, 2020, 11:07 AM IST

తెదేపా ప్రభుత్వ హయాంలో పులివెందులకు నీళ్లిచ్చి చీనీ చెట్లు ఎండిపోకుండా కాపాడితే.... కుప్పం నియోజకవర్గంపై ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. హంద్రీనీవా పనులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తెదేపా తలపెట్టిన పాదయాత్రను అడ్డుకోవటంతో పాటు నాయకుల అరెస్టులను ఖండించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్న వారిపై అణచివేత చర్యలు అప్రజాస్వామికమని మండిపడ్డారు. తక్షణమే అక్రమ కేసులు తొలగించి గృహనిర్బంధం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

రైతు వ్యతిరేక చర్యలకు వైకాపా స్వస్తి చెప్పాలని హితవు పలికారు. కుప్పం రైతుల సాగునీటి సమస్యలు, తాగునీటి ఎద్దడిని తక్షణమే పరిష్కరించటంతో పాటు హంద్రీనీవా ఎత్తిపోతల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details