తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత మరిశాలలో పండుగ పూట విషాదం నెలకొంది. పుట్టినరోజు వేడుక కోసం గోదావరి ఒడ్డుకు 20 మంది యువకులు వెళ్లారు. పార్టీ అనంతరం గోదావరిలో నదిలో ఈతకు దిగారు. ఈ క్రమంలోనే నలుగురు యువకులు గల్లంతయ్యారు.
ఆ యువకుల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని ప్రకాష్, కార్తీక్‌గా గుర్తించారు. మరో ఇద్దరు అన్వేష్, శ్రీకాంత్‌ల జాడ తెలియాల్సి ఉంది. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఘటనా స్థలంలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.