లోకేశ్, జయదేవ్, రామ్మోహన్‌కు పరిటాల శ్రీరామ్ సవాల్ - పరిటాల శ్రీరామ్ ఇంటిపనిలో అండగా నిలిచారు.
ఇంటి పనికీ, వంటపనికీ అండగా నిలిచేవాడే అసలైన మగాడు అంటూ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా విసిరిన "బి ద రియల్ మేన్ " సవాల్‌ను పరిటాల శ్రీరామ్ పూర్తి చేశారు. ఇంటిపనిలో సాయం చేసి, రియల్ మ్యాన్ అనిపించుకున్నారు.
లాక్‌డౌన్ వేళ భార్యకు ఇంటి పనికీ, వంటపనికీ అండగా నిలిచేవాడే అసలైన మగాడు అంటూ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా విసిరిన "బి ద రియల్ మేన్ " సవాల్‌ను తెలుగుదేశం నేతల పరిటాల శ్రీరామ్ స్వీకరించారు. పశువులకు మేత వేసి.. ట్రాక్టర్ నడుపుతూ వెళ్లి వ్యవసాయ పనులు చేశారు. లుంగీ కట్టి.. పొలం పనులు చేశారు. నాన్నకి, నాకు అందుబాటులో ఉన్న వ్యవసాయ పనులు చేశాను. మీరూ అందుబాటులో ఉన్న పనులు చేస్తారని ఆశిస్తూనంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇక మీవంతు అంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్‌నాయుడు, తెదేపా నేత కేఈ శ్యామ్‌బాబు సహా నటుడు మోహన్‌బాబు, దర్శకుడు ఎన్. శంకర్‌కు "బి ద రియల్ మేన్ " సవాల్ విసిరారు.
ఇదీ చదవండి:
'రూ.226 కోట్ల బకాయిలు చెల్లిస్తేనే... కొత్త రుణాలు'
TAGGED:
paritala sri ram