రాష్ట్రంలో 10 జెడ్పీటీసీ(zptc), 123 ఎంపీటీసీ(mptc) స్థానాల ఎన్నికల ఫలితాలను నేడు ప్రకటించనున్నారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. 14 జెడ్పీటీసీ స్థానాల్లో 4 ఏకగ్రీవమయ్యాయి. 10 చోట్ల పోలింగ్ నిర్వహించారు. 176 ఎంపీటీసీ స్థానాల్లో 50 ఏకగ్రీవమయ్యాయి. మూడు చోట్ల ఎవరూ నామినేషన్లు వేయలేదు. మిగిలిన 123 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు కోసం జిల్లాల్లో యంత్రాంగం ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
pariashath election results: నేడు పరిషత్ ఎన్నికల ఫలితాలు - ap latest news
రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల ఫలితాలు నేడు వెలవడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 16న పోలింగ్ జరిగింది.

pariashath election