జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయంలో తెదేపా నేత వర్ల రామయ్య దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూ.దుర్గాప్రసాదరావు గురువారం విచారణ జరపనున్నారు. పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చిందని వర్ల రామయ్య సింగిల్ జడ్జి వద్ద వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి... ఈ నెల 8న జరగనున్న ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ 6వ తేదీన మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
పరిషత్ ఎన్నికలు: వర్ల రామయ్య పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ - AP Political Updates
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల గురించి వర్ల రామయ్య దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. న్యాయమూర్తి జస్టిస్ యూ.దుర్గాప్రసాదరావు రామయ్య దాఖలు చేసిన వ్యాజ్యంపై లోతైన విచారణ జరపనున్నారు.
ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ... రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన అప్పీల్పై 7వ తేదీన విచారణ జరిపిన ధర్మాసనం... 8న ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చింది. ఓట్ల లెక్కింపు పక్రియ నిలుపుదల చేసింది. వ్యాజ్యంపై లోతైన విచారణ జరిపే విషయాన్ని సింగిల్ జడ్డికి అప్పగించింది. హైకోర్టు సింగిల్ జడ్డి వ్యాజ్యాన్ని ఈ నెల 15కు వాయిదా వేశారు. 15న విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. గురువారం ఈ వ్యాజ్యంపై విచారణ జరగనుంది.
ఇదీ చదవండీ... మొన్న రాళ్లదాడి చేశారు.. ఇవాళ కరెంట్ నిలిపేశారు: చంద్రబాబు