ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గతి తప్పిన పిల్లల టైంటేబుల్​ను.. గాడిన పెట్టాల్సింది మీరే..!

కరోనా వల్ల పిల్లలకి పాఠశాలలు లేవు. ఆన్‌లైన్‌ క్లాస్‌లు ఉన్నా గంట మాత్రమే.  వాళ్ల వీడియో గేమ్స్‌లో వాళ్లు బిజీ. తినే టైమ్‌ మారిపోతుంది. పడుకునే సమయం దాటిపోతుంది. ఇలాగే ఉంటే రేపు బడులు తెరిచాక చాలా ఇబ్బంది పడతారు. ఆహార మార్పుల వల్లా అనారోగ్యం బారిన పడతారు. అందుకే వాళ్లకి సమయం విలువ తెలపాల్సిన బాధ్యత తల్లితండ్రులదే!

గతి తప్పిన పిల్లల టైంటేబుల్​ను గాడిన పెట్టాల్సింది మీరే..
గతి తప్పిన పిల్లల టైంటేబుల్​ను గాడిన పెట్టాల్సింది మీరే..

By

Published : May 22, 2021, 1:35 PM IST

కరోనా వల్ల పాఠశాలలు మూతపడ్డాయి. దాదాపు ఏడాది నుంచి పిల్లలు ఇళ్లకే పరిమితమయ్యారు. వారి తినే టైం.. పడుకునే సమయం.. అంతా మారిపోయింది. ఇదిలాగే సాగితే వారు చిన్న వయస్సులోనే అనారోగ్యానికి గురవుతారు. అందుకే.. వాళ్లకి సమయం విలువ తెలిసేలా.. ప్రణాళికాబద్ధంగా జీవించాల్సిన అవసరం తెలిపే బాధ్యత తల్లిదండ్రులదే. మరి మీరేం చేయాలంటే..

  • బారెడు పొద్దెక్కేవరకూ పడుకోనివ్వకండి. రోజూ ఫలానా టైమ్‌కి లేవాలి. అప్పుడే ఆరోగ్యపరంగా బాగుంటారని తెలియజెప్పాలి. రెండు రోజులు మారాం చేసినా...ఆ తర్వాత నుంచి అలవాటుగా మారి వాళ్లే నిద్ర లేస్తారు.
  • వాళ్లకి టైం టేబుల్‌ రాసివ్వండి. పొద్దున్నుంచీ రాత్రివరకూ ఏమేం చేయాలో తెలియజేయాలి. పిల్లల రూంలోనే ఆ ప్రణాళిక అంటించాలి. టైం విలువ పదే పదే చెబుతూ దాన్ని చూపిస్తుంటే తప్పకుండా మార్పు వస్తుంది.
  • రోజూ ఒకే సమయానికి తినడం, పడుకోవడం, అలారం పెట్టి లేపడం అన్నీ సమయానుసారంగా జరగాలి. ఇలా చేస్తే క్రమశిక్షణ అలవడుతుంది. వాళ్ల పనులు వాళ్లే టైమ్‌కి చేసుకునేలా మారతారు.
  • ఏ పనినీ వాయిదా వేసే ఆలోచనే వాళ్లకి రానీయకుండా చూడాలి. ఈరోజు పనిని ఈరోజే చేయాలి. అది పదే పదే చెబితే.. వాళ్లు అనుకున్న పనిని అనుకున్న టైంకి చేసేస్తారు. దీనివల్ల భవిష్యత్తులో లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలరు.

ABOUT THE AUTHOR

...view details