ఇంతవరకు.. తమ ఇంటి ఆడపడుచులను ప్రేమించి వివాహం చేసుకున్నందుకు యువకులను హతమార్చిన ఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ.. ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. కన్న కూతుర్నే తల్లిదండ్రులు దారుణంగా చంపుకున్నారు. వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమిస్తోందని తెలిసి.. కుమార్తె రాజేశ్వరి(20)ని కత్తితో గొంతు కోసి హతమార్చారు.
నాగల్కొండకు చెందిన పవర్ రాజేశ్వరి.. అదే గ్రామానికి చెందిన ఓ ముస్లిం అబ్బాయి ప్రేమించుకున్నారు. తమ పెళ్లికి ఇద్దరి ఇళ్లలో ఒప్పుకోరని భావించారు. రెండు నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు.. అబ్బాయిపై నార్నూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. అబ్బాయిపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. చరవాణి సిగ్నల్స్ ద్వారా వీళ్లిద్దరు మహారాష్ట్రలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
- ఇదీ చూడండి:MURDER: బాపట్ల జిల్లాలో.. మహిళ దారుణ హత్య..!