ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దొంగతనం ఆరోపణలతో కుటుంబం ఆత్మహత్య - గుంటూరులో కుటుంబం ఆత్మహత్య వార్తలు

family-sucide-in-guntur-district
family-sucide-in-guntur-district

By

Published : May 25, 2020, 10:48 AM IST

Updated : May 25, 2020, 4:45 PM IST

10:42 May 25


గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని మరిప్రోలువారిపాలెంలో విషాదం నెలకొంది. వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే వీరారెడ్డి, భార్య వెంకటరమణ, కూతురు పోలేరు విషాహారం తిని బలవన్మరణానికి పాల్పడ్డారు. బంధువులు గమనించి స్థానికి ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే భార్య, కూతురు మరణించారు. మెరుగైన చికిత్స కోసం వీరారెడ్డిని గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచారు. 

మనస్థాపంతోనే

గ్రామంలో పొలం దగ్గర ఉండే నీటి మోటర్​ను దొంగలించారని వీరారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై పోలీసులు ప్రతి రోజు విచారణ పేరుతో పిలుస్తున్నారని మనస్థాపానికి గురైన కుటుంబసభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారని బంధువులు ఆరోపించారు.

కేసు నమోదైంది : పోలీసులు

ఈ నెల 16 వతేదీన వీరారెడ్డి పై బాపట్ల రూరల్ పోలీసుస్టేషన్​లో కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. గ్రామంలో మూడు మోటర్లు పోయిన కేసుపై విచారణ చేపట్టగా ..ఒకటి వీరారెడ్డి దగ్గర దొరికిందని వెల్లడించారు. గ్రామంలో చాలా మంది మోటర్లు పోయాయని ఫిర్యాదు ఇవ్వగా... మనస్థాపం చెందిన వీరారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు.

ఇదీ చదవండి:

తెలంగాణ: ఆ తొమ్మిది మంది హత్యకు కారణం ప్రేమ!

Last Updated : May 25, 2020, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details