పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఇప్పటికే కుటుంబ సభ్యులకు కొవిడ్ సోకి పలువురు ఇబ్బందులు పడుతున్న వేళ.. పరీక్షలకు సిద్ధం కాలేమంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతుండటం వల్ల భయంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నామని వాపోతున్నారు. పూర్తిగా శ్రద్ధపెట్టి చదివే అవకాశం లేదంటున్నారు. తల్లిదండ్రులు, బంధువులు మహమ్మారితో పోరాడుతున్న సమయంలో.. వారి నుంచి ఎటువంటి సహాయం లభించని పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. మరికొంత సమయం ఇస్తే ప్రశాంతంగా రాయవచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి:'యువతలోనూ రెండోసారి కరోనా ముప్పు ఎక్కువే!'
కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉండటంతో తమ బిడ్డలను పరీక్షలు రాసేందుకు పంపించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపించడం లేదు. పరీక్షల కన్నా పిల్లల ప్రాణాలే తమకు ముఖ్యమని చెబుతున్నారు. తల్లిదండ్రులకు వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఏ ఒక్క వ్యక్తికో, కుటుంబానికో సంబంధించిన విషయం కాదని.. మొత్తం సమాజంపై వైరస్ పంజా విసిరే అవకాశం ఉందనే విషయాన్ని గుర్తించాలని సీఎం జగన్కు విజ్ఞప్తి చేస్తున్నారు. పూర్తిగా రద్దు చేయాలని తాము కోరడం లేదని.. కేవలం రెండు నెలలు వాయిదా వేయాలని మాత్రమే అభ్యర్థిస్తున్నామంటున్నారు.
ఇదీ చదవండి:షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు: మంత్రి సురేశ్