ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'దిశ చట్టం ఉందని నిరూపిస్తే.. రాజకీయాలు వదిలేస్తా' - దిశ చట్టంపై తేదెపా వ్యాఖ్యలు

దిశ చట్టం ద్వారా ఏ మహిళకూ న్యాయం జరగలేదని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దిశ చట్టం ఉందని నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకొంటానని సవాల్‌ విసిరారు.

panchumarthi anuradha on disha act
panchumarthi anuradha on disha act

By

Published : Dec 3, 2020, 2:24 PM IST

దిశ చట్టం ద్వారా ఏ మహళకు న్యాయం జరిగిందో హోం మంత్రి సమాధానం చెప్పాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. ఈ చట్టం ద్వారా ఏ మహిళకూ న్యాయం జరగలేదని స్పష్టం చేశారు.

దిశ చట్టం పేరుతో మహిళలను మోసం చేసిన సీఎం జగన్‌పై చీటింగ్‌ కేసు నమోదు చేయాలని అన్నారు. అసలు ఉనికిలోనే లేని చట్టాన్ని అమలు చేశామంటూ ఏడాది పాటు వంచించారని దుయ్యబట్టారు. దిశ చట్టం ఉందని నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details