వైకాపా అధికారం చేపట్టిన రెండేళ్లలో రాష్ట్రంలో చిరువ్యాపారులపై 70వేల కోట్ల భారం మోపి 10వేల రూపాయలతో సర్దుకుపోమనడం దుర్మార్గమని.. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. జగనన్న తోడుచిరు వ్యాపారుల్ని మోసం చేసే కుట్రని మండిపడ్డారు. వడ్డీ లేని రుణాలపై తప్పుడు ప్రకటనలతో వ్యాపారులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. బ్యాంకులకు వడ్డీ చెల్లింపులపై ఎలాంటి హమీ ఇవ్వకుండా వడ్డీ లేని రుణాలు ఎలా సాధ్యమని నిలదీశారు.
వడ్డీ రాయితీ కింద ఇచ్చే సొమ్ముకంటే... ప్రచారం ఖర్చే ఎక్కువ: అనురాధ
జగన్ రెడ్డి వడ్డీ రాయితీ కింద ఇచ్చే సొమ్ముకంటే, ప్రచారానికి చేసే ఖర్చే ఎక్కువగా ఉందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ దుయ్యబట్టారు. రెండేళ్లలో రాష్ట్రంలో చిరువ్యాపారులపై 70వేల కోట్ల భారం మోపి 10వేల రూపాయలతో సర్దుకుపోమనడం దుర్మార్గమని మండిపడ్డారు.
10 లక్షల మందికి జగనన్న తోడు పథకాన్ని అందిస్తున్నట్లు గతఏడాది ప్రకటించి... ఈ ఏడాది 5.35 లక్షల మందికి మాత్రమే పరిమితం చేశారని పంచుమర్తి అనురాధ ఆక్షేపించారు. ప్రచారంలో ఒకటి చెప్పి, ప్రకటనల్లో మరొకటిచ్చి, అమల్లో వేరొకటి చేస్తూ పేదల ఆశలతో ఆటలాడుకుంటున్నారని పంచుమర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి వడ్డీ రాయితీ కింద ఇచ్చే సొమ్ముకంటే, ప్రచారానికి చేసే ఖర్చే ఎక్కువగా ఉందని దుయ్యబట్టారు.
ఇదీ చదవండీ...పేదవాడికి ఉపయోగపడని ప్రభుత్వాలు.. ఫెయిల్ అయినట్లే: సీఎం