సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసిన దృష్ట్యా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు కోరారు. శుక్రవారం సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌తో భేటీ అనంతరం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ ఎస్‌ఈసీ కార్యాలయానికి వచ్చారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్‌కు నోట్ ఇచ్చి వెనుదిరిగారు. పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టులో నిర్ణయం వెలువడే వరకు ఆగాలని అందులో విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసేవరకు ఎన్నికల నోటిఫికేషన్ వాయిదా వేయాలని నోట్లో పేర్కొన్నారు.
'వ్యాక్సినేషన్ ముగిసే వరకు ఎన్నికల నోటిఫికేషన్ వాయిదా వేయాలి' - AP SEC nimmagadda Ramesh Kumar news
19:54 January 22
ఎస్ఈసీకి పంచాయతీరాజ్ అధికారుల నోట్
ఎస్‌ఈసీ కార్యాలయానికి వచ్చిన అధికారులు... అక్కడే ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కలవలేదు. ఆయన పీఏకు నోట్ ఇచ్చి వెళ్లిపోయారు. అనంతరం సీఎస్ ఆదిత్యనాథ్‌తో మరోసారి జి.కె.ద్వివేది, గిరిజా శంకర్ భేటీ అయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వ ఎస్ఎల్‌పీ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది.
ఇదీ చదవండి