Yadadri Temple News: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహా స్వామి వారి సన్నిధిలో పంచకుండాత్మక మహాయాగం, మహాకుంభ సంప్రోక్షణ పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండోరోజు పంచకుండాత్మక పూజల్లో భాగంగా.. ఉదయం బాలాలయంలో శాంతిపాకం, అవధారలు, యాగశాలలో చతుస్థానార్చన, తోరణ ధ్వజకుంభారాధనలు కార్యక్రమాలు చేపట్టారు.
Yadadri Temple News: యాదాద్రిలో ఘనంగా పంచకుండాత్మక మహాయాగం - యాదాద్రి ఆలయ ఉద్ఘాటన మహాక్రతువు
Yadadri Temple News: యాదాద్రి ఆలయ ఉద్ఘాటన మహాక్రతువు కొనసాగుతోంది. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా రెండోరోజు పంచకుండాత్మక మహాయాగం నిర్వహిస్తున్నారు. పంచకుండాత్మక మహాయాగంలో ఉదయం శాంతిపాఠం, అవధారలు, చతుర్ధ స్థానార్చనలు పూజలు నిర్వహించారు.

యాదాద్రి ఆలయ ఉద్ఘాటన మహాక్రతువు
యాదాద్రిలో ఘనంగా పంచకుండాత్మక మహాయాగం
వేద పండితులు అగ్ని మధనం చేసి యజ్ఞ ప్రారంభం, విశేషహవనం నిర్వహించారు. సాయంత్రం సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, నిత్య విశేష హోమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈవో గీత రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: