ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థుల ఫైటింగ్ - వసతి గృహంలో విద్యార్థుల కొట్లాట

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బీసీ వసతి గృహంలో కొంతమంది విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలైనట్టు ఆరోపణలు వస్తున్నాయి. పక్కా ఆధారాలతో సహా మరికొంత మంది విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో హాస్టల్​లో విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

students fighting in hostel
బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థుల ఫైటింగ్

By

Published : Feb 20, 2021, 7:57 PM IST

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులు వీరంగం సృష్టించారు. కొంతమంది విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనవుతున్నారని మిగతావారు ఫిర్యాదు చేయడంతో ఘర్షణకు దారితీసింది. వార్డెన్​కు ఫిర్యాదు చేశారనే కోపంతో... విచక్షణ కోల్పోయి తోటి విద్యార్థులపై విరుచుకుపడ్డారు.

బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థుల ఫైటింగ్

విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడే ఉన్నప్పటికీ... వారిని నిలువరించేందుకు నానాతంటాలు పడాల్సి వచ్చింది. విద్యార్థులు కొంతకాలంగా చెడు వ్యసనాలకు అలవాటుపడ్డట్టు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తగిన ఆధారాలు కూడా చూపించడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details