ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పది, ఇంటర్​ పరీక్షల రద్దు పోరాటం..నారా లోకేశ్​కి పాలాభిషేకాలు - palabhishekam for nara lokesh news

రాష్ట్రంలో పదవ తరగతి, ఇంటర్​ పరీక్షల రద్దు కోరుతూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ చేసిన పోరాటానికి న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేస్తూ.. పలు జిల్లాల్లో ఆయనకు పాలాభిషేకాలు నిర్వహించారు. సుప్రీం తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల రద్దు నిర్ణయం తీసుకోవటంతో విద్యార్థి సంఘాలు లోకేశ్​కు కృతజ్ఞతలు తెలిపాయి.

palabhishekam for nara lokesh
నారా లోకేశ్​కి పాలాభిషేకాలు

By

Published : Jun 25, 2021, 8:25 PM IST

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ బాబుకి పాలాభిషేకం

రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ పోరాటానికి ఫలితంగా.. ప్రభుత్వం పరీక్షలు రద్దు చేయడాన్ని హర్షిస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో లోకేశ్​ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్(టీఎన్ఎస్ఎఫ్) ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడు పెనుబోయిన మహేశ్​ యాదవ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల తరఫున లోకేశ్​కు కృతజ్ఞతలు తెలిపారు.

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో తెదేపా కార్యాలయంలో తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నారా లోకేశ్​ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ప్రభుత్వం మొండివైఖరికి నిరసనగా పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం సమంజసం కాదని.. పరీక్షలను వెంటనే రద్దు చేయాలని నారా లోకేశ్ చేసిన పోరాటానికి ఈ రోజు న్యాయం జరిగిందని.. అందుకుగాను స్టూడెంట్ ఫెడరేషన్, విద్యార్థులు అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని విద్యార్థులు, యూనియన్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

కొవిడ్ నేపథ్యంలో విద్యార్ధుల ఆరోగ్య భద్రత కోసం పరీక్షల రద్దుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ పోరాటం చేసి విజయం సాధించారని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అన్నారు. తిరుపతి నగరంలోని ఎమ్మార్ పల్లి కూడలిలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మూడు నెలలుగా పరీక్షల రద్దుపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నా ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం తన మొండి పట్టుదలను వీడాల్సి వచ్చిందన్నారు. పదవ తరగతి, ఇంటర్ పరీక్షల రద్దు చేయడంతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.

ఇదీ చదవండి:HC: పరిషత్ ఎన్నికల రీనోటిఫికేషన్ ఉత్తర్వులపై స్టే.. విచారణ జులై 27కు వాయిదా

ABOUT THE AUTHOR

...view details