Paddy Damage in Nizamabad : తెలంగాణలోని నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షం అన్నదాతలకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నెలకొరిగింది. అలాగే పంట కోసి అమ్మకం కోసం 20రోజులుగా ఆరబెట్టిన వరిధాన్యం సైతం తడిసి....కొట్టుకుపోయింది. రైతులు తమ ధాన్యాన్ని రక్షించుకోవడానికి టార్పాలిన్లు కప్పినా ప్రయోజనం లేకుండాపోయింది. వర్షానికి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు నిరసన చేపట్టారు.
Paddy Damage in Kamareddy : కామారెడ్డి జిల్లాలో వర్షాలకు గాంధారి మార్కెట్ యార్డులో ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. ధాన్యం కొట్టుకుపోయింది. గాంధారిలో సెల్లార్ దుకాణాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. తడిసి పోయిన సామగ్రి, నీటిని ఎత్తిపోసేందుకు దుకాణాదారులు అవస్థలు పడ్డారు. జుక్కల్‌లో ధాన్యం కొట్టుకుపోగా.. జొన్న పంట నేలకొరిగింది. బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. దోమకొండలో వర్షానికి వరి ధాన్యం కొట్టుకుపోయింది.జోరు వానకు చాలా ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.ఈ అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
Heavy Rain in Nizamabad : జుక్కల్ నియోజకవర్గంలో బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్, జుక్కల్ మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లోనే వరిదాన్యం కుప్పలుగా ఉంటడంతో నష్టం జరిగింది. బిచ్కుంద మండలంలో ని పుల్కల్, పెద్ద దేవాడ, వాజీద్ నగర్, గోపన్ పల్లి గ్రామాల్లో రాత్రి కురిసిన వర్షానికి వరిదాన్యం మొత్తం వర్షపునీటీతో నిండిపోయింది. పిట్లం మండలం రాంపూర్ కలాన్‌లో వర్షానికి కుప్పగా ఉన్న వరిదాన్యం కొట్టుకుపోయింది. నిజాంసాగర్ మండలం కోమలంచ లో బస్తాలు తడిసిపోయాయి.