తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతుంటే అధిక ధరకు కొనుగోలు చేయడం ఏంటని ప్రజాపద్దుల ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. హైదరాబాద్లో ఈఆర్సీ ఛైర్మన్ నాగార్జునరెడ్డిని కలిసిన ఆయన.. విద్యుత్ ఒప్పందాలపై ఉన్న అనుమానాలు వివరించినట్లు తెలిపారు.
రైతుల కోసం చేసే విద్యుత్ కొనుగోలును తాము తప్పు పట్టట్లేదని స్పష్టం చేశారు. మార్కెట్‌లో తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతోందని.. అలాంటప్పుడు అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయటం ఎందుకని? ప్రశ్నించారు. వినియోగదారుడిపై ఎలాంటి భారం పడకుండా చూడాలని కోరానని తెలిపారు.