ఓ వైపు కొవిడ్ కేసులు తగ్గుతున్నప్పటికీ.. బాధితుల్లో ఆక్సిజన్(oxygen) అవసరమైన వారు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్ సోకిన వారిలో ఎక్కువ మందికి రెండు నుంచి మూడు వారాలు చికిత్స తీసుకోవాల్సి వస్తోంది. లక్షణాలు కనిపించగానే చికిత్స చేయించుకోవాలని.. లేని పక్షంలో ప్రమాదమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
oxygen: తగ్గని ప్రాణవాయువు అవసరాలు! - కొవిడ్ బాధితుల్లో పెరుగుతున్న ఆక్సిజన్ వినియోగం
కొవిడ్ కేసులు తగ్గుతున్నాయి. ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతోంది. అయితే... ప్రస్తుతం కొవిడ్ బాధితుల్లో ఆక్సిజన్(oxygen) అవసరమైన వారు ఎక్కువగా ఉంటున్నారు. కరోనా సోకిన వారిలోనూ అత్యధికులు రెండు నుంచి మూడు వారాలు చికిత్స తీసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

రాష్ట్రంలో 299 ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్స అందిస్తున్నారు. వీటిలో బుధవారం సాయంత్రం వరకు 37,744 పడకలు అందుబాటులో ఉండగా 6,084 మంది చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ డ్యాష్ బోర్డులో బుధవారం రాత్రి 7.30 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం...5,268 (86.58%) మంది ఐసీయూ, వెంటిలేటర్లు, ఆక్సిజన్ వార్డుల్లో ఉన్నారు. ఈ 5,268 మందిలో ఆక్సిజన్ అందించే వార్డుల్లో 19.64%, ఐసీయూల్లో 28.40%, వెంటిలేటర్లపై 23.37% మంది చికిత్స పొందుతున్నారు. మిగిలిన 866 మంది సాధారణ వార్డుల్లో (14.23%) చికిత్స పొందుతున్నారు. బాధితుల ఆక్సిజన్ లెవెల్స్ 94 కంటే తగ్గినప్పుడు బయటి నుంచి ప్రాణవాయువు అందిస్తున్నారు.
ఇదీ చదవండి:అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోబోయిన సిబ్బందిపై.. పెట్రోల్‌తో దాడి!