రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు విధానంలో ఉద్యోగులను తీసుకునేందుకు.. అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 'ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్‌డ్ సర్వీసెస్-ఆప్కోస్' పేరిట పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్టు సాధారణ పరిపాలన శాఖ పేర్కొంది. లాభాపేక్ష రహిత సంస్థగా ఇది పనిచేస్తుందని స్పష్టం చేసింది. ఆప్కోస్ సంస్థను నడిపించేందుకు చైర్మన్‌తో పాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నియామకాన్ని ప్రకటిస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఛైర్మన్‌గా సాధారణ పరిపాలన శాఖ సర్వీసెస్ విభాగం కార్యదర్శి వ్యవహరిస్తారని.. డైరెక్టర్లుగా వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఉంటారని ప్రభుత్వం స్పష్టం చేసింది. విజయవాడ కేంద్రంగా 10 కోట్ల రూపాయల మూలధనంతో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఏజెన్సీల బారినపడి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మోసపోకుండా ఈ కొత్త కార్పొరేషన్ పనిచేస్తుందని ప్రభుత్వం వివరించింది.
ఏపీలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు - ఆప్కోస్ వార్తలు
రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు విధానంలో ఉద్యోగులను తీసుకునేందుకు.. 'ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్‌డ్ సర్వీసెస్-ఆప్కోస్' పేరిట పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు