ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

OU LADIES HOSTEL: చికెన్ కర్రీలో పురుగు.. ఓయూ క్యాంపస్​లో విద్యార్థినిల ఆందోళన - protest the road

చికెన్ కర్రీలో పురుగు వచ్చిందంటూ ఓయూ క్యాంపస్​లో విద్యార్థినిలు రోడ్డెక్కారు. ఆదివారం మధ్యాహ్నం విద్యార్థులందరూ కలిసి వసతిగృహం ముందు రోడ్డుపై బైఠాయించారు. మహిళా వసతి గృహంలో సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థినులు డిమాండ్ చేశారు.

ఓయూ క్యాంపస్​లో విద్యార్థినిల ఆందోళన
ఓయూ క్యాంపస్​లో విద్యార్థినిల ఆందోళన

By

Published : Mar 28, 2022, 1:57 PM IST

ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) మహిళా వసతి గృహంలో సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థినులు రోడ్డెక్కారు. ఆదివారం మధ్యాహ్నం లంచ్‌ టైమ్‌లో లేడిస్‌ హాస్టల్‌ మెస్‌లో ఓ విద్యార్థినికి చికెన్‌ కర్రీలో పురుగు వచ్చిందని అక్కడున్న సిబ్బందిని నిలదీశారు. అయితే, వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో విద్యార్థినులంతా కలిసి వసతిగృహం ముందు రోడ్డుపై బైఠాయించారు.

ఓయూ క్యాంపస్​లో విద్యార్థినిల ఆందోళన

ఉన్నత చదువుల కోసం తాము ఓయూకు వస్తే ఇక్కడ టాయిలెట్లు కూడా సరిగా లేవని, మంచి నీటి సౌకర్యం లేదని, నాణ్యమైన ఆహారం కూడా అందించడంలేదని వాపోయారు. మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ఎలా చదువుకుంటామని ప్రశ్నించారు. నాణ్యమైన ఆహారం అందించాలని, నీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం సాయంత్రం 3.30 గంటల నుంచి రాత్రి 8.30 వరకు ఆందోళన కొనసాగింది. పోలీసులు నచ్చజెప్పడంతో శాంతించిన విద్యార్థినులు ఆందోళన విరమించారు.

ఓయూ క్యాంపస్​లో విద్యార్థినిల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details