ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ట్యాబ్‌పై పరీక్షల నిర్వహణ - Osmania University Latest News

ట్యాబ్​పై పరీక్షలను నిర్వహించేందుకు ఉస్మానియా యూనివర్శిటీ కసరత్తు చేస్తోంది. ఐటీ సంస్థలతో ఓయూ సంప్రదింపులు జరిపింది. ట్యాబ్​ పరీక్షా విధానాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని ఓయూ అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ ప్రయోగం వల్ల శ్రమ తగ్గడమే గాక సమయం ఆదా అవుతుందని భావిస్తున్నారు.

OU exams online
ట్యాబ్​లపై ఓయూ పరీక్షలు

By

Published : Apr 24, 2020, 1:00 PM IST

ప్రశ్నపత్రాల ముద్రణ, జవాబుపత్రాల తరలింపు, వాటి స్కానింగ్‌... పరీక్షలకు అనుసరిస్తున్న ఈ ప్రక్రియను మార్చాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం యోచిస్తోంది. గత ఏడాది నుంచే ఆన్‌ స్క్రీన్‌ మూల్యాంకనానికి శ్రీకారం చుట్టి కొత్త ప్రయోగానికి తెరతీసింది. ఈ కారణంగానే కరోనా నేపథ్యంలోనూ సకాలంలో ఫలితాలు ఇవ్వగలిగారు. ఈ అనుభవంతో ఓయూ ఈసారి సమాధానాలను ట్యాబ్‌పై రాసే విధానం వైపు అడుగులు వేస్తోంది.

ఏమిటీ కొత్త విధానం?

  • ఈ విధానాన్ని ఆన్‌లైన్‌ పరీక్షల్లో స్మార్ట్‌ ఆన్సర్‌ బుక్‌గా పిలుస్తారు. పరీక్షలప్పుడు విద్యార్థులకు ట్యాబ్‌ (ఎగ్జామ్‌ స్లేట్‌) అందజేస్తారు. ట్యాబ్‌పై ఈ-పెన్నుతో.. జవాబులు రాయాలి. పూర్తయ్యాక వాటిని ట్యాబ్‌ నుంచే పంపిస్తే ఓయూ పరీక్షల విభాగం సర్వర్‌లోకి వెళుతుంది.
  • వాటిని మూల్యాంకన కేంద్రంలో ఉన్న కంప్యూటర్ల నుంచి అధ్యాపకులు ఓపెన్‌ చేసి మార్కులు వేస్తారు. అధ్యాపకులు ఇంటి నుంచి కూడా మూల్యాంకనం చేయవచ్చు.
  • ఈ ట్యాబ్‌ ఒక్కోటి రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.

వచ్చే ఏడాది నుంచి అమలుకు యోచన

విశ్వవిద్యాలయం తుది నిర్ణయం తీసుకుంటే వచ్చే ఏడాది నుంచి ఇంజినీరింగ్‌, బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ లాంటి కోర్సుల విద్యార్థులకు ప్రయోగాత్మకంగా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే పరీక్షల విభాగం అధికారులు కొన్ని పరీక్షలకు సంబంధించి ఐటీ సేవలను అందించే సంస్థలతో చర్చించారు. వర్సిటీ అవసరాలకు అనుగుణంగా ఒక సంస్థ సాఫ్ట్‌వేర్‌ సైతం రూపొందిస్తున్నట్లు సమాచారం.

ఇవీచూడండి:రెడ్​జోన్ ప్రాంతాలపై నిఘా కోసం మరో యాప్: డీజీపీ

ABOUT THE AUTHOR

...view details