ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పంచాయతీరాజ్ చట్టంలో సవరణలపై ఆర్డినెన్స్ జారీ

పంచాయతీరాజ్ చట్టంలో సవరణలపై ఆర్డినెన్స్ జారీ అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే వ్యక్తులు గ్రామాల్లో ఉండేలా, గ్రామ అభివృద్ధి, పాలనా వ్యవహారాల్లో పాల్గొనేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.

Ordinance Issed on Panchayatraj act amendments
పంచాయతీరాజ్ చట్టంలో సవరణలపై ఆర్డినెన్స్ జారీ

By

Published : Feb 20, 2020, 8:40 PM IST

పంచాయతీరాజ్ చట్టంలో సవరణలపై ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. చట్టంలో సవరణలపై గత కేబినెట్‌లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 13 నుంచి 15 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగించేలా ఆర్డినెన్స్ జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల్లో ప్రచార గడువు 5 రోజులుగా నిర్ణయించింది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రచార గడువు 7 రోజులుగా నిర్ణయించిన ప్రభుత్వం... స్థానిక ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే అనర్హత వేటు పడేలా ఆర్డినెన్స్ జారీ చేసింది. స్థానిక ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే మూడేళ్ల జైలు, రూ.10 వేలు జరిమానా విధించేలా నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు గ్రామాల్లో ఉండేలా, గ్రామ అభివృద్ధి, పాలనా వ్యవహారాల్లో పాల్గొనేలా ఆర్డినెన్స్ జారీ అయ్యింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details