ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పులివెందులలో 'ఇర్మా-ఏపీ' కేంద్రం ఏర్పాటుకు ఉత్తర్వులు - ఏపీ సీఎం జగన్

పులివెందులలో ఇర్మా(ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ మెనేజ్​మెంట్)ఏపీ ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉతర్వులు ఇచ్చింది. ఈనెల 24వ తేదీన సీఎం జగన్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.

Irma-AP center at Pulivendula
Irma-AP center at Pulivendula

By

Published : Dec 23, 2020, 3:00 AM IST

కడప జిల్లా పులివెందులలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ మెనేజ్​మెంట్ -ఏపీ కేంద్రం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 83 కోట్ల రూపాయలతో ఇర్మా- ఏపీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఈనెల 24వ తేదీన ముఖ్యమంత్రి జగన్ ఇర్మా- ఏపీ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఏపీ కేంద్రం ద్వారా గ్రామీణ అభివృద్ధి సంబంధించి వివిధ కోర్సులను అందించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ ఇర్మా- ఏపీ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి అనుమతి మంజూరు చేసింది.

ABOUT THE AUTHOR

...view details