ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీ ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు - ఏపీ మత్సకార శాఖ తాజా వార్తలు

ఏపీ ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు రాష్ట్రస్థాయిలో ఆక్వా కల్చర్ సీడ్ కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. క్షేత్రస్థాయిలో సీడ్ నాణ్యత నియంత్రణల పర్యవేక్షణ కోసం కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీని ప్రభుత్వం నియమించింది.

ఏపీ ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు
ఏపీ ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు

By

Published : Dec 29, 2020, 8:06 PM IST

Updated : Dec 29, 2020, 9:44 PM IST

ఏపీ ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ సైన్స్​ విశ్వవిద్యాలయ డీన్ అధ్యక్షతన 13 మంది సభ్యులతో కమిటీని నియమించారు. మరోవైపు రాష్ట్రస్థాయిలో ఆక్వా కల్చర్ సీడ్ కమిటినీ నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఎంపెడా, కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ సహా ఆక్వా రైతులు, ఇతర విభాగాల అధికారులతో రాష్ట్రస్థాయి కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. క్షేత్రస్థాయిలో సీడ్ నాణ్యత నియంత్రణల పర్యవేక్షణ కోసం కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది.

Last Updated : Dec 29, 2020, 9:44 PM IST

ABOUT THE AUTHOR

...view details