Oppositions: వికేంద్రీకరణ పేరుతో జగన్ రెడ్డి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని.. విపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. శాసనసభలో మూడు రాజధానులపై జగన్ చేసిన వ్యాఖ్యలపై వైకాపా మినహా అన్ని పార్టీల నేతలూ ముక్తకంఠంతో ఖండించారు. రాష్ట్రంలో రోడ్ల మీద పడిన గుంతల్లో మూడు గుంతలు కూడా మరమ్మతు చేయలేని జగన్ రెడ్డి.. మూడు రాజధానులు ఎలా కడతారని.. తెదేపా ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. అభివృద్ధి గురించి మాట్లాడే నైతికహక్కు జగన్ మోహన్ రెడ్డికి లేదని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు.
Oppositions: "వికేంద్రీకరణతో.. విద్వేష రాజకీయాలు చేస్తున్నారు" - ఏపీ లేటెస్ట్ అప్డేట్స్
Oppositions: శాసనసభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల్ని విపక్షాలు ఖండించాయి. వికేంద్రీకరణతో విద్వేష రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డాయి. అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదని ధ్వజమెత్తాయి. హైకోర్టు తీర్పునూ లెక్కచేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. పట్టింపులకు పోకుండా అమరావతిని రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశాయి.
తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు జగన్ వ్యవహరిస్తున్నారని వామపక్ష నేతలు మండిపడ్డారు. హైకోరు స్పష్టమైన తీర్పు ఇచ్చినా.. సీఎం జగన్ మొండి వైఖరి అవలంభిస్తున్నారని.. జనసేన నాయకులు ధ్వజమెత్తారు. కోర్టుల జోక్యాన్ని ప్రశ్నించడం జగన్ మూర్ఖత్వానికి పరాకాష్ట అని అభిప్రాయపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి పట్టింపులకు పోకుండా అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:"మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం.. ఈ విషయంలో వెనకడుగు వేయబోం"