ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రోడ్డెక్కిన విపక్షాలు.. ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ - ఏపీ తాజా వార్తలు

Opposition protests on inflated RTC charges: ఆర్టీసీ ఛార్జీల పెంపుపై తెలుగుదేశం ఆందోళనలు మిన్నంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ఎదుట నేతలు నిరసన తెలిపారు. రిక్షాలు తొక్కుతూ ఆందోళన నిర్వహించారు. వారం వారం భారం మోపి ప్రజల జీవితాలను ప్రభుత్వం ఆగమాగం చేస్తోందని మండిపడ్డారు. బాదుడు ఆపకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Opposition protests on inflated RTC charges
రాష్ట్రవ్యాప్తంగా విపక్షాల నిరసన

By

Published : Apr 15, 2022, 7:43 PM IST

Opposition protests on inflated RTC charges: పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా విపక్షాలు ఆందోళన ఉద్ధృతం చేశాయి. శ్రీకాకుళంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి నేతృత్వంలో తెలుగుదేశం శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. ఛార్జీల పెంపు సామాన్యుడికి భారంగా మారిందంటూ నినాదాలు చేశారు. పలాసలో తెలుగుదేశం నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. తెలుగుదేశం కార్యకర్తలు రోడ్డుపై ధర్నా చేస్తుండగా.. సీఐ శంకర్రావు తోసేశారు. సీఐ తీరుతో ఆగ్రహించిన కార్యకర్తలు.. ఆయనతో వాగ్వాదానికి దిగారు.

రాష్ట్రవ్యాప్తంగా విపక్షాల నిరసన

Opposition protests on inflated RTC charges: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన తెలిపారు. పల్లె వెలుగు బస్సు ఎక్కి ప్రయాణికులకు టికెట్ కొట్టించారు. కురుపాం నియోజకవర్గంలో తెదేపా నాయకులు ర్యాలీ తీశారు. సాలూరులో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద తెదేపా ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ.. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆందోళన చేశారు. బస్సు ఎక్కి జి.మాడుగులలో దిగారు. సీఐటీయూ ఆధ్వర్యంలో పాడేరు కాంప్లెక్స్ వద్ద పెంచిన ధరలు తగ్గించాలంటూ నినాదాలు చేశారు.

Opposition protests on inflated RTC charges: కోనసీమ జిల్లా పి.గన్నవరం, అంబాజీపేట, ముక్తేశ్వరంలో తెలుగుదేశం నాయకులు ధర్నా చేశారు. ఆర్టీసీ ఛార్జీల బాదుడు ఆపాలంటూ కాకినాడలో మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నినాదాలు చేశారు. రాజమహేంద్రవరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో నిరసన జరిగింది. ప్రయాణికులకు బాదుడే బాదుడు పేరిట కరపత్రాలు పంపిణీ చేశారు. పెంచిన ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.

Opposition protests on inflated RTC charges: కృష్ణాజిల్లా గుడివాడలో తెదేపా శ్రేణులు బాదుడే బాదుడు పేరిట నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెనమలూరు నియోజవర్గంలో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కార్యకర్తలతో కలిసి.. పోరంకి సెంటర్ నుంచి ఆర్టీసీ బస్సులో ఉయ్యూరు బస్ స్టాండ్ వరకు ప్రయాణించి ఛార్జీల పెంపుపై అవగాహన కల్పించారు. ఎన్టీఆర్‌ జిల్లాలో గొల్లపూడి నుంచి మైలవరం వరకు మాజీ మంత్రి దేవినేని ఉమ బస్సులో ప్రయాణించి ఛార్జీల భారంపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ధరల బాదుడు పెరిగిందని మండిపడ్డారు.

Opposition protests on inflated RTC charges: గుంటూరులో తెలుగుదేశం నేతలు ఎన్టీఆర్​ బస్‌స్టాండ్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. బాదుడే బాదుడు అంటూ నినాదాలతో హోరెత్తించారు. బాపట్ల జిల్లా బాపట్లలో కొత్త బస్టాండ్‌ వద్ద బాదుడే బాదుడు అంటూ భజన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులో రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి రాఘవరెడ్డి ఆధ్వర్యంలో రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామన్న సీఎం జగన్ మడమ తిప్పి, మాటతప్పి జనం నడ్డివిరుస్తున్నారని మండిపడ్డారు. పామూరు ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి వగ్గంపల్లి వరకు బస్సులో ప్రయాణికులతో కలిసి నాయకులు ప్రయాణించారు. వగ్గంపల్లి ప్రధాన కూడలిలో నిరసన తెలిపారు.

Opposition protests on inflated RTC charges: నెల్లూరులో రిక్షా తొక్కుతూ తెదేపా నేతలు వినూత్న నిరసన తెలిపారు. బస్సుల్లో ప్రయాణించలేమని.. మళ్లీ రిక్షాలే దిక్కంటూ జిల్లా తెదేపా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ప్రయాణికులకు అవగాహన కల్పించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ ప్రయాణీకులతో వెంకటగిరి నుంచి నెల్లూరు వెళ్లే బస్సులో ఎక్కి 5 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. సొంత నగదుతో బస్సు ఎక్కిన వారికి టిక్కెట్లు తీసి ఇచ్చారు.

Opposition protests on inflated RTC charges: అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం కల్లూరులో తెలుగుదేశం ఆందోళన నిర్వహించింది. ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటి అంటూ నినాదాలు చేశారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం శ్రేణులు బస్టాండ్ ఆవరణంలో బైఠాయించి ఆందోళన చేశారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో తెలుగు తమ్ముళ్లు ర్యాలీ తీశారు. ఆర్టీసీ మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు.

ఇదీ చదవండి: Power Cut Problems: అనధికార విద్యుత్‌ కోతలు.. విలవిల్లాడుతున్న పరిశ్రమలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details