హిందూ దేవుళ్లపై మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మంత్రిపై విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. హిందువులను రెచ్చగొట్టేలా మంత్రి మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాచవరం దాస ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన సోము వీర్రాజు...కొడాలి నానిని శిక్షించాలని ప్రార్థించారు. దేవాలయాలపై మంత్రి కొడాలి వ్యాఖ్యలను ఖండించారు. నాయకులు ఇష్టారీతిన మాట్లాడడం సరికాదన్నారు. మాట్లాడే భాష ద్వారా ప్రజలకు ఏం సందేశమిస్తున్నామో గుర్తుంచుకోవాలన్నారు. ఏ సీఎం అయినా తమ సభ్యులు సరిగా మాట్లాడేలా చూడాలని హితవు పలికారు. నాయకులు వినియోగించే భాష పట్ల చట్టబద్ధత ఉండాలని చెప్పారు. మంత్రి కొడాలి నాని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కొడాలి నాని వ్యాఖ్యలను ఖండిస్తూ భాజపా కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేశారు. మంత్రిపై పలు జిల్లాల్లో భాజపా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీఎం మౌనం వీడాలి
సీఎం జగన్ మౌనంగా ఉంటూ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలను సమర్థిస్తున్నారని రాష్ట్ర భాజపా సహ ఇన్ఛార్జ్ సునీల్ దేవ్‌ధర్ వ్యాఖ్యానించారు. అటు తిరుపతిలో మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని తిరుమల-తిరుపతి సంరక్షణ సమితి... భాజపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొడాలి వ్యాఖ్యలపై భాజపా నేతలు తిరుపతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మతసామరస్యాన్ని నాశనం చేయొద్దు