Raksha Bandhan :తపాలా శాఖ ద్వారా రాఖీలను పంపించడం ఎప్పటి నుంచో ఉన్నదైనా.. తొలిసారిగా సైన్యంలో ఉన్న సోదరులకు పంపించేందుకు తెలంగాణ తపాలా సర్కిల్ అవకాశం కల్పించింది. కేవలం రూ.41లు చెల్లించి ఈ సేవలను పొందవచ్చని పేర్కొంది. జవాన్/సోల్డియర్, కేరాఫ్ 1సీబీపీవో, దిల్లీ చిరునామాకు పంపిస్తే.. వారికి ఉన్న కోడ్ ఆధారంగా సరిహద్దుల్లో ఉన్న సైనికులకు రాఖీలు వెళ్తాయని తెలంగాణ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
'తపాలా'లో సైనికులకు రాఖీ.. తొలిసారిగా తెలంగాణ సర్కిల్ సేవలు - rakhi festival latest news
Raksha Bandhan: సైన్యంలో ఉన్న తమ సోదరులకు రాఖీలను పంపించేందుకు తెలంగాణ తపాలా సర్కిల్ తొలిసారిగా అవకాశం కల్పించింది. తెలంగాణ ప్రాంతంలోని 6,214 తపాలా కార్యాలయాల నుంచి ఈ సేవలు పొందవచ్చని పేర్కొంది. ఆగస్టు 10 వరకూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.
'తపాలా'లో సైనికులకు రాఖీ..
తెలంగాణ ప్రాంతంలోని 6,214 తపాలా కార్యాలయాల నుంచి ఈ సేవలు పొందవచ్చు. భద్రతా కారణాల దృష్ట్యా పంపించేవారి చిరునామా కవర్‌పై రాయకూడదని నిబంధన పెట్టింది. కవర్‌పై రక్షాబంధన్ అని మాత్రమే రాసి పంపాలని పేర్కొంది. ఆగస్టు 10 వరకూ రాఖీలను ఇలా పంపించవచ్చని సూచించింది.
ఇవీ చూడండి..