ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వ కేసుల పర్యవేక్షణ కోసం ‘ఆన్‌లైన్‌ లీగల్‌ కేస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌’ - Special provision for resolution of government cases

హైకోర్టులో ప్రభుత్వ శాఖలపై దాఖలయ్యే వ్యాజ్యాలను వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఆన్‌లైన్‌ లీగల్‌ కేస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఓఎల్‌సీఎంఎస్‌)’ పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ కేసుల్ని ఆన్‌లైన్‌లో పర్యవేక్షించే విధానాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. దాన్నే ఇప్పుడు మన రాష్ట్రంలోనూ అనుసరించనున్నారు.

‘Online Legal Case Monitoring System’
ఆన్‌లైన్‌ లీగల్‌ కేస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌

By

Published : Aug 29, 2021, 7:09 AM IST

వివిధ ప్రభుత్వ శాఖలపై హైకోర్టులో దాఖలయ్యే వ్యాజ్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఆన్‌లైన్‌ లీగల్‌ కేస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఓఎల్‌సీఎంఎస్‌)’ పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖలపై కోర్టులో దాఖలవుతున్న కేసుల్లో సకాలంలో కౌంటర్‌ దాఖలు చేయకపోవడంతో కొందరు సీనియర్‌ అధికారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సమాచార లోపం, ప్రభుత్వశాఖల్లో జవాబుదారీతనం కొరవడటంవల్లే ఈ సమస్య ఏర్పడుతోందని భావిస్తున్న ప్రభుత్వం... దానికి పరిష్కారంగా ఓఎల్‌సీఎంఎస్‌ వ్యవస్థను తెరపైకి తెచ్చినట్టు తెలిసింది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులపై అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ సుబ్రహ్మణ్యం, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఓఎల్‌సీఎంఎస్‌కు రూపకల్పన చేశారు. ప్రభుత్వ కేసుల్ని ఆన్‌లైన్‌లో పర్యవేక్షించే విధానాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. దాన్నే ఇప్పుడు మన రాష్ట్రంలోనూ అనుసరించనున్నారు.

ఏపీఐతో అనుసంధానం

హైకోర్టుకు సంబంధించిన అప్లికేషన్‌ ప్రొటోకాల్‌ ఇంటర్‌ఫేస్‌ (ఏపీఐ)లో వివిధ కేసుల సమాచారం ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ అవుతుంది. దాన్ని ఇప్పుడు ఓఎల్‌సీఎంఎస్‌తో అనుసంధానం చేస్తారు. దీనికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి సమ్మతించినట్టు సమాచారం. ఓఎల్‌సీఎంఎస్‌కు రాష్ట్రస్థాయి నోడల్‌ అధికారిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అహ్మద్‌బాబును ప్రభుత్వం నియమించింది. ప్రతి ప్రభుత్వశాఖలో ఒకరిని నోడల్‌ అధికారిగా నియమిస్తారు. ఆ శాఖకు సంబంధించి కోర్టులో ఏ కేసులు దాఖలయ్యాయి? వాటిపై ప్రభుత్వానికి కోర్టు ఏ ఆదేశాలు జారీచేసింది? ఎప్పటిలోగా కౌంటరు దాఖలుచేయాలి? వంటి అంశాలన్నిటినీ రోజూ చూసుకుని, స్పందించాల్సిన బాధ్యత ఆ నోడల్‌ అధికారిదే. కోర్టు కేసుల పర్యవేక్షణకు డ్యాష్‌బోర్డు ఏర్పాటుచేస్తారు. వివిధ కేసుల్లో కౌంటరు అఫిడవిట్‌ కూడా ఇకపై ప్రభుత్వ శాఖలు ఆన్‌లైన్‌లోనే దాఖలు చేయనున్నాయి. అది ఆ శాఖ నుంచి ప్రభుత్వ న్యాయవాదులకు వెళుతుంది. వారు దాన్ని పరిశీలించి కోర్టుకు సమర్పిస్తారు.

ఇదీ చదవండీ..వరుస పెళ్లిళ్లతో యువతి మహామోసం ..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details