ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భాగ్యనగరంలో 'ఉల్లి' చోరీ... దొంగను పట్టించిన సీసీటీవీ

ఇప్పటి వరకు బంగారం, వెండి ఆభరణాలు దొంగతనం చేయడం చూశాం. మద్యం దొంగిలించడం గురించి విన్నాం.. అయితే ఉల్లిపాయలు చోరీకి గురవ్వడం విచిత్రంగా ఉంది కదూ..! ఈ సంఘటన హైదరాబాద్​లో జరిగింది.

onions-got-theft-at-domalaguda-in-hyderabad
భాగ్యనగరంలో 'ఉల్లి' దొంగ

By

Published : Dec 14, 2019, 12:55 PM IST

హైదరాబాద్​ దోమలగూడలోని జ్యోతినగర్​లో తోపుడు బండి మీద ఓ మహిళ ఉల్లిపాయలు విక్రయిస్తుంటుంది. రోజూలానే రాత్రి కాగానే బండి మూసేసి.. ఫుట్​పాత్​ పక్కన పెట్టి ఇంటికి వెళ్లిపోయింది. ఇదంతా గమనించిన ఓ వ్యక్తి.. అర్ధరాత్రి సమయంలో అక్కడికి వచ్చి 20 కిలోలకు పైగా ఉల్లిపాయలను సంచిలో వేసుకొని వెళ్లాడు.

తెల్లవారుజామున ఉల్లి విక్రయించే మహిళ వచ్చి చూసేసరికి తన బండిలో ఉల్లి తక్కువగా ఉండటం గమనించింది. ఎవరో దొంగతనం చేశారని నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఆ వ్యక్తిని గుర్తించారు.

భాగ్యనగరంలో ఉల్లికీ భద్రత లేకుండా పోయిందనీ.. ఇకపై ఉల్లిపాయలకూ భద్రత కల్పించాల్సిన అవసరముందని బండి యజమాని ఈశ్వరీబాయి అభిప్రాయపడ్డారు.

భాగ్యనగరంలో 'ఉల్లి' దొంగ

ABOUT THE AUTHOR

...view details