ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉల్లి పంటను గ్రామాల్లోనే కొనుగోలు చేయాలి: లోకేశ్ - nara lokesh news

ఉల్లి పంటకు మద్దతు ధర రాక రైతులు నష్టపోతున్నారని నారా లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి పంటకు ఎకరాకు 80 వేల వరకు రైతులు ఖర్చు చేస్తున్నారన్న లోకేశ్‌... గ్రామాల్లోనే మద్దతుధర ఇచ్చి ఉల్లిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

Onion crop should be bought in villages: Lokesh
లోకేశ్

By

Published : Aug 8, 2020, 4:08 PM IST

ఉల్లి పంటకు మద్దతు ధర రాక రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్ట పోతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలోదాదాపు 34 లక్షల క్వింటాళ్ల ఉల్లి దిగుబడి వస్తోందని.. ఉల్లి సాగు చేసిన రైతులు పంట కొనుగోలు లేకపోవటంతో, మద్దతు ధర రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

లోకేశ్ ట్వీట్

ఎకరాకు 70 నుంచి 80 వేలు వెచ్చించి ఉల్లి పంటను వేసిన రైతులకు కన్నీరు మిగిలిందని విచారం వ్యక్తం చేశారు. ఉల్లి పంట అమ్మకానికి ప్రధాన మార్కెట్ కేంద్రమైన కర్నూల్ మార్కెట్ యార్డ్ కరోనా తీవ్రత కారణంగా మూతబడిందని... ప్రభుత్వం చెపుతున్నట్లుగా సచివాలయాల వద్ద కొనుగోలు జరగటం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉల్లిపంటను రైతుల వద్ద నుంచి వారి గ్రామంలోనే మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండీ... అమరావతి ప్రాంతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మూసివేత!

ABOUT THE AUTHOR

...view details