ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TS News: బొగ్గు గనిలో కొనసాగుతున్న సహాయక చర్యలు.. ఒకరు వెలికితీత - తెలంగాణ తాజా వార్తలు

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం ఆండ్రియాల్‌ లాంగ్​వాల్ ప్రాజెక్టులో ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా ఘటనపై పూర్తిస్థాయి స్పష్టత రావడం లేదు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు నిన్నటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

బొగ్గు గనిలో కొనసాగుతున్న సహాయక చర్యలు
బొగ్గు గనిలో కొనసాగుతున్న సహాయక చర్యలు

By

Published : Mar 8, 2022, 7:27 PM IST

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం ఆండ్రియాల్‌ లాంగ్​వాల్​ ప్రాజెక్టులో ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా ఘటనపై పూర్తిస్థాయి స్పష్టత రావడం లేదు. బొగ్గు గని పైకప్పు కూలి.. ముగ్గురు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు నిన్నటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బొగ్గు గని శిథిలాల నుంచి బదిలీ వర్కర్​ రవీందర్​ను వెలికి తీశారు. అనంతరం వెంటనే ఆస్పత్రికి తరలించారు.

బొగ్గు గనిలో కొనసాగుతున్న సహాయక చర్యలు

శిథిలాలను యంత్రాల ద్వారా తొలగిస్తే అందులో చిక్కుకుపోయిన వారికి గాయాలు, ప్రాణనష్టం జరుగుతుందేమోనన్న ఉద్దేశ్యంతో మ్యానువల్​గానే శిథిలాలను తొలగిస్తున్నారు. దీనివల్లనే సహాయక చర్యల్లో ఆలస్యమవుతోందని సమాచారం. రెస్క్యూ టీం నిన్నటి నుంచి సహాయక చర్యలు చేపట్టి ఇప్పటివరకు ముగ్గురిని బయటికి తీసుకురాగలిగారు. వీరయ్య, పిల్లి నరేష్, జాడి వెంకటేశ్వర్లును కాపాడగలిగారు. శిథిలాల కింద ఏరియా సేఫ్టీ మేనేజర్ జయరాజ్, అసిస్టెంట్ మేనేజర్ చైతన్య తేజ, ఒప్పంద కార్మికుడు శ్రీకాంత్​లను బయటికి తీసుకు రావడానికి రెస్య్కూ టీం కృషిచేస్తోంది.

మరో వైపు కుటుంబ సభ్యులంతా తమవాళ్లను ఎప్పుడు బయటికి తీసుకువస్తారా అంటూ ఎదురుచూస్తున్నారు. ముగ్గురు సింగరేణి డైరెక్టర్లు బలరాం, చంద్రశేఖర్, సత్యనారాయణ.. బొగ్గు గని వద్ద క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బొగ్గు గనిలోని ప్రమాద స్థలికి ఆక్సిజన్ సిలిండర్లు, మెడికల్ కిట్లను పంపిస్తూ చర్యలను ముమ్మరం చేశారు.

ఇదీచూడండి:బొగ్గు గనిలో ప్రమాదం.. శిథిలాల కింద చిక్కుకుపోయిన పలువురు సిబ్బంది

ABOUT THE AUTHOR

...view details