ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AMARAVATI: రాజధాని గ్రామాల్లో అడుగడుగునా ఆంక్షలు.. ఉద్రిక్తత.. 61 మందిపై కేసులు

అడుగడుగునా ఆంక్షలు.. అవరోధాలు.. రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమం సందర్భంగా పోలీసులు కఠిన ఆంక్షలను అమలు చేశారు. సాధారణ జనజీవనాన్ని బెంబేలెత్తించారు. ఇవాళ అమరావతి (Amaravati) ఉద్యమం 600వ రోజులకు చేరుకుంటున్న సందర్భంగా రైతులు, మహళలు.. 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' పేరుతో ప్రదర్శనకు పిలుపునిచ్చారు. పోలీసులు.. ఎక్కడికక్కడే నిరసనకారులను అడ్డుకున్నారు. రాజధాని గ్రామాల్లోకి ఎవరూ రాకుండా.. చివరకు మీడియా ప్రతినిధులను సైతం గ్రామాల్లోకి వెళ్లకుండా కఠిన నిర్బంధ ఆంక్షలు అమలు చేయడం వివాదాస్పదమైంది. వీటికి తోడు.. 61 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Amravati
Amravati

By

Published : Aug 8, 2021, 12:52 PM IST

Updated : Aug 8, 2021, 8:38 PM IST

రాష్ట్ర ప్రయోజనాలు.. తమ పిల్లల భవిష్యత్తు కోసం రాజధాని అమరావతి(Amaravati) నిర్మాణానికి అప్పటి ప్రభుత్వానికి భూములిచ్చారు. అధికారంలోకి వచ్చిన వైకాపా.. మూడు రాజధానుల పేరుతో కొత్త గానం అందుకోవడంపై రాజధాని రైతులు, మహిళలు మండిపడుతున్నారు. సీఆర్డీయేతో(CRDA) చేసుకున్న ఒప్పందం ప్రకారం.. అమరావతినే ఏకైక రాజధానిగా అభివద్ధి చేయాలంటూ గళమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో 600 రోజులుగా నిరంతంరంగా దీక్షా శిబిరాల్లో నిరసన చేపడుతున్నారు. అమరావతినే పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించాలంటూ.. అప్పటినుంచి నినదిస్తున్నారు. నేడు మంగళగిరి స్వామివారి ఆలయానికి ప్రదర్శన చేయడానికి యత్నించారు. అనుమతి లేదని అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు.. రైతులు, ఆందోళనకారులు అంతా కలిపి.. 61 మందిపై కేసులు నమోదు చేశారు.

అనుమతి నిరాకరణ.. కట్టుదిట్టమైన చర్యలు

తాజాగా 600వ రోజైన ఇవాళ.. అమరావతిలో హైకోర్టు( న్యాయస్థానం) నుంచి మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ప్రదర్శనగా వెళ్లాలని రైతులు పిలుపునిచ్చారు. కొవిడ్ వ్యాప్తి నివారణ, 144 సెక్షన్లు వంటివి ముందే అమల్లో ఉన్నందున ర్యాలీలకు అనుమతించబోమని పోలీసు ఉన్నతాధికారులు ఒకరోజు ముందే స్పష్టం చేశారు. ఉదయం నుంచే ఆయా గ్రామాల్లో ర్యాలీలకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు చేపట్టారు. కొన్నిచోట్ల ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. తుళ్లూరు, అనంతవరం, దొండపాడు, నేలపాడు నుంచి హైకోర్టుకు వెళ్లకుండా పోలీసులు పహారా నిర్వహించారు. అయినప్పటికీ వివిధ మార్గాల్లో న్యాయస్థానం వద్దకు చేరుకునేందుకు రైతులు, మహిళలు ప్రయత్నించగా.. వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

స్వామివారి సన్నిధిలో అమరావతి నినాదాలు.. అరెస్ట్​

కొందరు రాజధాని ప్రాంత రైతులు మంగళగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వెళ్లి అమరావతి నినాదాలు చేయగా... వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు నుంచి రాజధాని గ్రామాల్లోకి వెళ్లే మార్గంలో పెదపరిమి వద్ద ఉదయం నుంచీ స్థానికులను తప్ప ఎవరినీ పోనీయలేదు. స్థానికులైనప్పటికీ వారు ఏదో గుర్తింపు కార్డు చూపిస్తే తప్ప గ్రామాల్లోకి విడిచిపెట్టలేదు. ఈ నేపథ్యంలో రాజధాని ఆందోళనలో పాల్గొన్న 61 మంది రైతులు, తెదేపా కార్యకర్తలపై తాడేపల్లి, మంగళగిరి స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.

'మాపై ఎందుకింత కక్షసాధింపు?'

600 రోజుల నుంచి ఉద్యమం సాగుతుండగా ఏనాడూ మీడియా ప్రతినిధులను నియంత్రించని పోలీసు.. ఈసారి మీడియా ప్రతినిధులపై కూడా ఆంక్షలు విధించారు. ఓవైపు భూములు కోల్పోయి... మరోవైపు రాజధాని అమరావతి అర్థాంతరంగా ఆగిపోయి తాము ఆందోళన చెందుతుంటే ప్రభుత్వం, పోలీసులు తమపై ఎందుకిలా కక్షసాధింపులు చేపడుతున్నారని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ప్రశ్నిస్తున్నారు.

అమరావతిని సాధించే వరకు పోరాటం ఆగదు

పోలీసులు ఆంక్షలు విధిస్తున్నప్పటికీ తమ ఉద్యమాన్ని ఇంకా ఉద్ధృతం చేస్తామని... అమరావతిని సాధించే వరకు తమ పోరాటం ఆగదని రాజధాని రైతులు, మహిళలు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై స్పందించాలని వారు వేడుకుంటుననారు.

నేతల గృహనిర్బంధం

మాజీ మంత్రి దేవినేని ఉమా గృహనిర్బంధం

అమరావతి ఆందోళనలో పాల్గొంటారన్న సమాచారంతో మందస్తుగానే తెదేపా నేతలను గృహనిర్బంధం చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, కొనకళ్ల నారాయణను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

మందడంలో రైతులను అడ్డుకున్న పోలీసులు

మందడంలో రైతులను అడ్డుకున్న పోలీసులు

తుళ్లూరులో ఉద్రిక్తత

తుళ్లూరులో ఉద్రిక్తత

కృష్ణాయపాలెంలో..

కృష్ణాయపాలెంలో ఆందోళన

తాడేపల్లిలో అమరావతికి వెళ్తున్న తెదేపా నేతలు అరెస్టు

తాడేపల్లిలో అమరావతికి వెళ్తున్న తెదేపా నేతలు అరెస్టు

వెంకటపాలెంలో రైతుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

వెంకటపాలెంలో రైతుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

ఇదీ చదవండి

Last Updated : Aug 8, 2021, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details