ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈనెల 30న లక్ష మందితో వర్చువల్ బహిరంగ సభ: అమరావతి ఐకాస - amaravthi farmers protest news

అమరావతి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 495వ రోజూ దీక్ష శిబిరాల్లో మహిళలు, రైతులు నిరసలు చేపట్టారు. రాజధాని ఉద్యమానికి ఈనెల 30తో 500 రోజులు పూర్తి కానున్న నేపథ్యంలో లక్ష మందితో వర్చువల్ బహిరంగ సభను నిర్వహిస్తామని అమరావతి ఐకాస వెల్లడించింది.

ఏపీ రాజధాని అమరావతి
three capitals for ap

By

Published : Apr 25, 2021, 4:40 PM IST

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు 495వ రోజు ఆందోళన చేశారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, అనంతవరం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, నెక్కల్లు, ఉద్ధండరాయునిపాలెంలో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. కరోనా భయంతో రైతులు, మహిళలు ఇళ్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈనెల 30వ తేదీ నాటికి ఉద్యమం ప్రారంభించి 500రోజులు కావొస్తున్న నేపథ్యంలో భారీ సభ ఏర్పాటు చేయాలని రాజధాని ఐకాస నిర్ణయించింది. వర్చువల్ విధానంలో సుమారు లక్షమందితో సభ నిర్వహించనున్నారు. 'ఆంధ్రుల బతుకు, భరోసా, భవిత కోసం అమరావతి ఉద్యమ భేరి- 500 రోజులు' పేరుతో వర్చువల్ బహిరంగ సభ నిర్వహిస్తామని ఐకాస నేతలు తెలిపారు. ఈ సమావేశానికి జాతీయస్థాయి రాజకీయ నేతలు, న్యాయకోవిదులు, సామాజికవేత్తలు, విశ్రాంత సివిల్ సర్వీస్ ఉద్యోగులు, పాత్రికేయులు, విద్యావేత్తలు, రైతు నాయకులు, పారిశ్రామిక వేత్తలు, దళిత నాయకులు, కవులు, కళాకారులు, ఆటగాళ్ళు, సినీ, టీవీ కళాకారులు, వైద్య నిపుణులు పాల్గొననున్నారు. సభను వీక్షించేందుకు అన్ని దీక్షా శిబిరాలలో ఎల్ఈడీ తెరను ఏర్పాట్లు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details