ప్రజావేదికను కూల్చివేసి ఏడాదైన సందర్భంగా పరిశీలనకు వెళ్లిన తెదేపా నేతలను అరెస్టు చేయటాన్ని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. గతేడాది ఇదే రోజున ఏపీ విధ్వంసానికి జగన్ నాంది పలికారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించి ప్రతి సంస్థను నాశనం చేశారని ఆరోపించారు. జగన్ ఏడాది పాలనకు ఈ విధ్వంసాలే నమూనా అని విమర్శించారు.
ఒక్క రాత్రిలోనే కూల్చేశారు: లోకేశ్
ప్రజావేదిక ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన తెదేపా నేతలను అరెస్టు చేయటంపై నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతల అరెస్టును ఖండించారు. ప్రజావేదిక కూలగొట్టి ఏపీ విధ్వంసానికి జగన్ పునాది వేశారని దుయ్యబట్టారు. ఎన్నో వ్యయప్రయాలకోర్చి ప్రజావేదికను నిర్మించారని గుర్తు చేశారు. అలాంటి వేదికను ఒక్క రాత్రిలోనే కూల్చేశారని విమర్శించారు.
ఇదీ చదవండి:
అమరావతి కరకట్ట వద్ద తీవ్ర ఉద్రిక్తత.. తెదేపా నేతల అరెస్టు